కరోనా కాటుకు ఆర్మీ జవాను మృతి

తాజా వార్తలు

Updated : 27/07/2021 05:25 IST

కరోనా కాటుకు ఆర్మీ జవాను మృతి


రామకృష్ణ

బోనకల్లు, న్యూస్‌టుడే: కరోనా సోకిన తాతను తన వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించాలనుకున్న ఆర్మీ జవాను అదే కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రావినూతల గ్రామానికి చెందిన కందిమల్ల రామకృష్ణ(32) నాగాలాండ్‌లో ఆర్మీ జవానుగా పని చేస్తున్నారు. తన తాతకు కొవిడ్‌ రావడంతో జూన్‌ 28న స్వగ్రామానికి వచ్చారు. తాతను తన వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించాలనుకున్నారు. ఈ లోగా తాత చనిపోయారు. కర్మకాండలు చేసి వెళ్లాలనుకున్న రామకృష్ణ కరోనా బారినపడ్డారు. చికిత్స పొంది కొవిడ్‌ నుంచి బయటపడిన అతడు పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో ఆకస్మికంగా చనిపోయారు. రామకృష్ణకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆర్మీ జవాను మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సర్పంచి కొమ్మినేని ఉపేందర్‌ సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని