పెట్రోల్‌ పోస్తే నీళ్లొచ్చాయి

తాజా వార్తలు

Updated : 03/08/2021 06:10 IST

పెట్రోల్‌ పోస్తే నీళ్లొచ్చాయి

సీసాల్లో నింపగా పెట్రోలు, నీరు కలిసి ఉన్న దృశ్యం

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ గ్రామీణ మండలం బొమ్మకల్‌ రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న హెచ్‌.పి.పెట్రోల్‌ బంకులో పెట్రోలుకు బదులు నీళ్లు పోశారని పలువురు వాహనదారులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం దుర్శేడు గ్రామానికి చెందిన ఇద్దరు వాహన యజమానులు బంకులో పవర్‌ పెట్రోల్‌ పోయించుకొని కొద్ది దూరం పోగానే వారి ద్విచక్ర వాహనాలు ఆగిపోయాయి. మెకానిక్‌కు చూపించగా కల్తీ పెట్రోల్‌తో ఆగిపోయిందని చెప్పగా వాహనదారులు బంకు వద్దకు చేరుకొని సిబ్బందిని నిలదీశారు. సీసాల్లో పెట్రోల్‌ నింపగా పెట్రోల్‌ పైన కింద నీరు కనిపించింది. అక్కడికి చేరుకున్న ఇతర వాహనదారులంతా అక్కడే ఉన్న బకెట్‌లో పెట్రోలు పోయించగా నీళ్లు ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని సమస్య సద్దుమణిగేలా చేశారు. కల్తీపై పౌరసరఫరాల శాఖ డీఎస్‌ఓ సురేశ్‌రెడ్డి, బంకు మేనేజర్‌ మహ్మద్‌ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌లో 10 శాతం కంటే ఎక్కువ ఇథనాల్‌ కలపడంతో ఈ సమస్య తలెత్తుతోందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని