Crime News: మెడకు బెల్టు కట్టి.. కర్రలతో దాడి

తాజా వార్తలు

Updated : 22/09/2021 10:32 IST

Crime News: మెడకు బెల్టు కట్టి.. కర్రలతో దాడి

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా అర్జున్‌పుర్‌ గ్రామంలో ఓ యువకుడిని.. ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. మెడకు బెల్టు కట్టి.. కర్రలతో కొడుతుండడంతో బాధితుడు బల్దావ్‌ జాదవ్‌ (28) దెబ్బలకు తాళలేక గావుకేకలు పెట్టాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన బల్దావ్‌ గ్రామంలోని ఓ బాలికను వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు.. ఆగ్రహంతో యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎనిమిది పది రోజుల క్రిందటిదని తెలిపిన పోలీసులు, దాడిచేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని