యువతి నిద్రిస్తుండగా అసభ్య ప్రవర్తన

తాజా వార్తలు

Updated : 25/09/2021 06:49 IST

యువతి నిద్రిస్తుండగా అసభ్య ప్రవర్తన

దిశ యాప్‌లో ఫిర్యాదుతో యువకుడి అరెస్ట్‌

నారాయణవనం, న్యూస్‌టుడే: ఒంటరిగా నిద్రిస్తున్న యువతి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన నారాయణవనం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రియాంక కథనం మేరకు.. తుంబూరు ఎస్సీ కాలనీకి చెందిన విక్రమ్‌(28) తాపీమేస్త్ర్త్రి. గురువారం అర్ధరాత్రి అదే గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న యువతి(20) పట్ల అసభ్యంగా ప్రవర్తించే యత్నం చేశాడు. అప్రమత్తమైన యువతి కేకలు వేస్తూ అతన్ని బయటకు నెట్టేసింది. ఆపై దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. విజయవాడ కంట్రోల్‌ రూము నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు సమాచారం వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడు విక్రమ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించినట్లు ఎస్సై తెలిపారు. అర్ధరాత్రి సమయంలోనూ దిశ యాప్‌ ఎస్‌ఓఎస్‌ కాల్‌ ద్వారా సమాచారం అందిన తొమ్మిది నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొన్న ఎస్సై ప్రియాంక, సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని