వేర్వేరుగా ప్రేమికుల బలవన్మరణం

తాజా వార్తలు

Updated : 27/09/2021 05:05 IST

వేర్వేరుగా ప్రేమికుల బలవన్మరణం

నాగమణి

సూర్యాపేట నేరవిభాగం, నాంపల్లి, న్యూస్‌టుడే: రెండేళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి కలకాలం జీవించాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడం.. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో అర్ధాతరంగా తనువు చాలించారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. సూర్యాపేట పురపాలిక పరిధిలోని సుందరయ్యనగర్‌కు చెందిన నాగమణి(24), దుబ్బతండాకు చెందిన ధరవత్‌ నెహ్రూ(28) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా నాగమణి ఇటీవల నర్సింగ్‌ విద్యనభ్యసించి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల ముందు ఉంచారు. నాగమణి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. మరో వ్యక్తితో ఆమెకు వివాహం చేసేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ధరవత్‌ నెహ్రూ దుబ్బతండాలోని తన నివాసంలో శనివారం ఉరేసుకొని చనిపోయారు. నెహ్రూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అతడి ప్రేయసి నాగమణి హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌-చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలుకింద పడి అదేరోజు రాత్రి ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహన్ని కుటుంబ సభ్యులు సుందరయ్యనగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. చేతికి అందివచ్చిన కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా నాగమణి మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు నాంపల్లి రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

ధరవత్‌ నెహ్రూ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని