మద్యం మత్తులో వీరంగం

తాజా వార్తలు

Updated : 18/10/2021 05:13 IST

మద్యం మత్తులో వీరంగం

మట్టెవాడ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో యువకులు వృద్ధుడిపై దాడికి దిగి గాయపరిచిన ఘటన శనివారం అర్థరాత్రి వరంగల్‌ ఇంతేజార్‌గంజ్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం. సీకేఎం కాలేజీ మార్గంలోని ఓ పూల దుకాణం ముందు దస్తగిరి అనే వృద్ధుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. గిర్మాజీపేటకు చెందిన యాట విజయ్‌, సంజయ్‌ మద్యం మత్తులో వృద్ధుడిని దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడి చేశారు. సమీపంలోని పూల దుకాణదారులు వచ్చి సర్దిచెప్పినా వినలేదు. విజయ్‌, సంజయ్‌ తమ స్నేహితుడు, మేయర్‌ తాత్కాలిక వాహనచోదకుడు మోసిన్‌కు సమాచారం అందించారు. మోసిన్‌ మరికొంత మందిని తీసుకొచ్చి దస్తగిరి, పూల దుకాణాల్లో పనిచేసేవారిపై కర్రలతో దాడికి దిగి హల్‌చల్‌ చేశారు. ఈ దాడిలో యూసుఫ్‌, సలీం, అఫ్జల్‌తో పాటు మరికొంతమంది పూల దుకాణాల సిబ్బంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు, తోటి దుకాణదారులు ఆదివారం ఇంతేజార్‌గంజ్‌ ఠాణాకు చేరుకొని ఆందోళనకు దిగారు. పూల దుకాణాల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న తమకు పోలీసులు రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సీఐ మల్లేష్‌ వివరణ కోరగా.. దస్తగిరి ఫిర్యాదు మేరకు విజయ్‌, సంజయ్‌, మోసిన్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. దాడిలో మోసిన్‌కు చేయి విరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ రౌడీషీటర్‌ ప్రమేయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని