అక్కడ హత్య చేసి.. ఇక్కడ ఆసుపత్రిలో చేరి!

తాజా వార్తలు

Updated : 26/10/2021 05:46 IST

అక్కడ హత్య చేసి.. ఇక్కడ ఆసుపత్రిలో చేరి!

చందానగర్‌ పోలీసుల అదుపులో నిందితుడు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆమె పేరు నాగచైతన్య.. ఒంగోలు సమీప గ్రామ వాసి. నగరంలో ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. అతని పేరు గాదె కోటిరెడ్ఢి గుంటూరు జిల్లా వాసి. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. తరచూ వైద్యశాలకు వెళ్లే క్రమంలో నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లి చిన్నతనంలోనే కన్నుమూయడం.. తండ్రి కూడా కొన్నాళ్ల కిందట కాలం చేయడంతో సవతి తల్లి మాత్రమే ఉంది. సామాజిక వర్గాలు వేరు కావటంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నాగచైతన్య ఉద్యోగం వదిలి హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఓ వైద్యశాలలో పనిచేస్తోంది. కోటిరెడ్డి ఈ నెల 22న హైదరాబాద్‌ వెళ్లి ఆమెను కలిశాడు. అనంతరం ఇద్దరూ ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. 23వ తేదీ రాత్రి నాగచైతన్య లాడ్జి గదిలోనే హత్యకు గురైంది. కోటిరెడ్డి మాత్రం అదృశ్యమయ్యాడు. ఈ ఉదంతంపై చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. హైదరాబాద్‌ లాడ్జి గది నుంచి అదృశ్యమైన కోటిరెడ్డి సోమవారం ఉదయం ఒంగోలు జీజీహెచ్‌లో దర్శనమిచ్చాడు. ఒంటిపై కత్తిప్లోట్లతో చికిత్స కోసం చేరాడు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో తాను, నాగచైతన్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశామని.. తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెబుతున్నాడు. తనను బంధువులు ఎవరో కాపాడి ఒంగోలు వైద్యశాలలో చేర్చినట్లు వెల్లడిస్తున్నాడు. కోటిరెడ్డి కోసం గాలిస్తున్న చందానగర్‌ పోలీసులు సోమవారం ఒంగోలు వచ్చి జీజీహెచ్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరబాద్‌ తరలించారు. అసలేం జరిగిందనే వివరాలు పోలీసు విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని