వేధింపులు తాళలేక.. భర్తను చంపిన భార్య

తాజా వార్తలు

Updated : 26/10/2021 05:15 IST

వేధింపులు తాళలేక.. భర్తను చంపిన భార్య

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: మద్యం తాగి నిరంతరం వేధిస్తున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం రంగంపల్లి గ్రామంలో జరిగింది. సీఐ నవీన్‌కుమార్‌ వివరాల ప్రకారం.. రంగంపల్లికి చెందిన దుర్గం నర్సింహులు(46)కు నేరచరిత్ర ఉంది. ఇటీవల చర్లపల్లి జైలు నుంచి వచ్చాడు. భార్యపై అనుమానంతో వేధించడం, నిత్యం మద్యం తాగొచ్చి కొట్టడం చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి తాగి వచ్చి భార్యను చంపుతానని బెదిరించి, నిద్ర పోయాడు. చంపుతాడేమోనన్న భయంతో భార్య హంసమ్మ బండరాయితో కొట్టి అతణ్ని హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని