Suicide: 16 ఏళ్లకే ప్రేమ.. వద్దన్నందుకు బాలుడి బలవన్మరణం

తాజా వార్తలు

Updated : 27/10/2021 13:14 IST

Suicide: 16 ఏళ్లకే ప్రేమ.. వద్దన్నందుకు బాలుడి బలవన్మరణం

నారాయణగూడ, న్యూస్‌టుడే: చదువుకునే వయసులో ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కింగ్‌కోఠిలో పర్దాగేట్‌లో నివాసం ఉండే బాలుడు(16) ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవల ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో పలుసార్లు మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు సోమవారం అర్ధరాత్రి గదిలోకి వెళ్లి తలుపు లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు కిటికీలోంచి చూసేసరికి చున్నీతో ఉరివేసుకొని ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని