Crime News: పెళ్లికి ఒప్పుకోలేదని.. ఇల్లు తగుల బెట్టాడు

తాజా వార్తలు

Updated : 27/10/2021 12:46 IST

Crime News: పెళ్లికి ఒప్పుకోలేదని.. ఇల్లు తగుల బెట్టాడు


నవీన్‌

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: యువతిని వివాహం చేసుకుంటానంటూ వేధింపులకు గురిచేయడమే కాకుండా ఒప్పుకోకపోవడంతో ఇంటిని తగలబెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు, ఎస్‌ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేఆర్‌నగర్‌ మల్లికార్జుననగర్‌కాలనీకి చెందిన నవీన్‌(23) ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని రెండేళ్లుగా పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 10న యువతి నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆమెకు పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్‌ ఈ నెల 22న తెల్లవారుజామున యువతి బంధువుకు ఫోన్‌ చేసి యువతి ఇంటిని తగలబెడతానంటూ హెచ్చరించాడు. అనంతరం 23న కాలనీవాసులు యువతి ఇల్లు మంటల్లో కాలిపోయినట్లు గుర్తించి ఊళ్లో ఉన్నవారికి సమాచారం అందించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు నవీన్‌ను మంగళవారం అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని