హత్య చేసింది నాగేంద్రబాబే!
close

తాజా వార్తలు

Updated : 24/10/2020 06:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హత్య చేసింది నాగేంద్రబాబే!

దివ్య తేజస్విని గాయాలు..  సొంతంగా చేసుకున్నవి కావు
శవపరీక్ష, ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ‘మా ప్రేమను దివ్య తేజస్విని తల్లిదండ్రులు అంగీకరించలేదు. అందుకే తామిద్దరం కలసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. ఎవరికి వాళ్లం కత్తితో గాయాలు చేసుకున్నాం’ అని విజయవాడకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్యతేజస్విని హత్యకేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని పోలీసులు తేల్చారు. శవపరీక్ష, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. దివ్య శరీరంపై బలంగా, లోతుగా అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని.. అందుకు అవకాశమే లేదని ఆ నివేదికల్లో వెల్లడైంది. దీంతో పాటు పోలీసులు పలు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసిన దిశ పోలీసులు ఛార్జిషీటును సిద్ధం చేశారు. ఈ నెల 26వ తేదీన న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఆ రోజు.. సంఘటనకు సంబంధించి గదిలో ఏం జరిగిందనే విషయంపై స్పష్టత రాలేదు. నిందితుడు నాగేంద్రబాబుని విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని వైద్యులు డిశ్ఛార్జి చేయగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని