TS News: ఇదో భయంకరమైన ప్రమాదం!

తాజా వార్తలు

Updated : 10/06/2021 11:11 IST

TS News: ఇదో భయంకరమైన ప్రమాదం!

ఇదో భయంకరమైన ప్రమాదం.. అత్యంత వేగంగా దూసుకువచ్చిన ఓ కారు రోడ్డు మీద వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడి ప్రాణం ‘గాలి’లో కలిసిపోయింది. ఆ యువకుడు ఏకంగా ఎగిరి చెట్టుకొమ్మకు చిక్కుకొని అక్కడే మృతిచెందారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.. నిర్మల్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఉట్నూరు నుంచి కడెం వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉట్నూరు మండలం నిలాగొండికి చెందిన సోయం మాన్కు(28) ఎగిరి చెట్టు కొమ్మకు చిక్కుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మృతిచెందారు. కారులోని వ్యక్తి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు.

- న్యూస్‌టుడే, కడెం



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని