Ap News: ప్రేమించిందని నిప్పంటించారు..

తాజా వార్తలు

Updated : 16/06/2021 08:26 IST

Ap News: ప్రేమించిందని నిప్పంటించారు..

రాయచోటి, న్యూస్‌టుడే: తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి దిగిన ఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ జి.రాజు కథనం.. ‘కొంతకాలంగా ఆ యువతికి మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నిస్తున్నా అడ్డు చెబుతోంది. మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. సోదరుడు, తల్లి, తండ్రి ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. గాయపడిన ఆమెను కడప రిమ్స్‌కు తరలించాం’ అని సీఐ రాజు వివరించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని