Crime: ఫోన్‌లో మాట్లాడుతున్నారని.. కర్రలతో చితకబాదారు

తాజా వార్తలు

Published : 05/07/2021 07:04 IST

Crime: ఫోన్‌లో మాట్లాడుతున్నారని.. కర్రలతో చితకబాదారు

ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కుటుంబ సభ్యుల అమానుషం

ధార్‌: మేనమామ కుమారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారన్న ఆగ్రహంతో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను సొంత కుటుంబ సభ్యులే జుట్టు పట్టి ఈడుస్తూ కర్రలతో  చితకబాదిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా పిపల్వ గ్రామంలో జూన్‌ 22న ఈ ఘటన జరిగింది. వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. 19, 20 ఏళ్ల వయసున్న బాధితురాళ్లను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.  నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని