Ap news: తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య 

తాజా వార్తలు

Updated : 18/07/2021 08:15 IST

Ap news: తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య 


మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనాథ్‌, సీఐ చైతన్యకృష్ణ

అత్తిలి, న్యూస్‌టుడే: తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురైన ఘటన అత్తిలిలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. తణుకు సీఐ చైతన్య కృష్ణ కథనం మేరకు.. అత్తిలికి చెందిన బందెల సురేష్‌ (31) మద్యానికి బానిసై తల్లిదండ్రులను కొడుతున్నాడు. దీంతో అతని తమ్ముడు మహేష్‌ అన్నపై కక్ష పెంచుకుని అత్తిలి శాఖా గ్రంథాలయం వద్ద ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సురేష్‌ను కత్తితో బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనాథ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని