AP News: పగలు డ్రైవర్‌.. రాత్రయితే అధికారి

తాజా వార్తలు

Updated : 21/07/2021 06:43 IST

AP News: పగలు డ్రైవర్‌.. రాత్రయితే అధికారి

అమలాపురం పట్టణం: పగలంతా వాణిజ్య పన్నులశాఖ అధికారి వద్ద డ్రైవర్‌.. రాత్రయ్యే సరికి అధికారిగా అవతారమెత్తి ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనచోదకులు, చిరువ్యాపారులను దోచుకుంటాడు. ఈ ఉదంతానికి సంబంధించి సీఐ షేక్‌ బాజీలాల్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురానికి చెందిన కొప్పర్తి వీరషణ్ముఖం వాణిజ్య పన్నులశాఖ అధికారి కార్యాలయానికి కారు అద్దెకు ఇచ్చి తానే డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈదరపల్లి బొంతువారి పేటకు చెందిన గూడపాటి స్వరూప్‌ కుమార్‌ గత నెల 24 రాత్రి 9.30 గంటల సమయంలో ఆటోలో కొంతమంది ప్రయాణికులను తీసుకుని నల్లవంతెన వైపు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆ ఆటోను ఆపి తాము విజిలెన్సు అధికారులమని బెదిరించి రూ.5 వేలు బలవంతంగా లాక్కున్నారు. వారి ప్రవర్తనపై అనుమానంతో..వారు ఉపయోగించిన కారు నంబర్‌ ఆధారంగా అప్పటి నుంచి స్వరూప్‌కుమార్‌ నిఘా పెట్టాడు. ఆ రోజు కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించి మంగళవారం తమకు ఫిర్యాదు చేశారని సీఐ చెప్పారు. ఆటో డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కొప్పర్తి వీరషణ్ముఖం, కాగితపల్లి శివన్నారాయణ, పాలగుమ్మి సూరిబాబుపై కేసు నమోదు చేసి, వారు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నామన్నామని, నిందితులు పరారీలో ఉన్నారని సీఐ చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని