TS News: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం!

తాజా వార్తలు

Updated : 05/08/2021 07:17 IST

TS News: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం!

మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి నిర్వాకం

గార్ల, న్యూస్‌టుడే: ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఓ బాలుడు(17) ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు. తరువాత మరో బాలిక(14)తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని