Love Story: టీనేజర్ల ప్రేమ కథ విషాదాంతం

తాజా వార్తలు

Updated : 16/08/2021 06:48 IST

Love Story: టీనేజర్ల ప్రేమ కథ విషాదాంతం

నెలక్రితం బాలిక... ఇప్పుడు యువకుడి బలవన్మరణం

కారేపల్లి, న్యూస్‌టుడే: ప్రియురాలి బలవన్మరణానికి తానే కారణమన్న బాధ.. పంచాయితీలో కుటుంబ పరువు పోయిందన్న వ్యథ ఆ యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు తన పెదనాన్న ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆ యువకుడు.. అతడి గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లికి బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు. నెల రోజుల క్రితం యువకుడు తాను పురుగు మందు తాగుతున్నానని పేర్కొంటూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ప్రియురాలికి పంపాడు. అది చూసి బాలిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. బాలిక మృతిపై ఫిర్యాదు లేకపోవటంతో కేసు నమోదు కాలేదు. ఈ ఘటన జరిగిన రోజే అతణ్ని తల్లిదండ్రులు పక్కమండలంలో ఉన్న పెదనాన్న ఇంటికి పంపారు. కొద్ది రోజుల తరువాత అతడు బాలికకు పంపిన వీడియో వెలుగుచూసింది. తల్లిదండ్రులు పంచాయితీ పెట్టారు. రూ.13 లక్షలు జరిమానా కట్టాలని పెద్ద మనుషులు తేల్చారు. యువకుడి తండ్రి రూ.లక్ష చెల్లించి మిగతా మొత్తానికి నోటు రాసిచ్చారు. 3 రోజుల క్రితం యువకుడు సొంతింటికి వెళ్లగా పంచాయితీ గురించి తెలిసింది. ఆదివారం తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చి మనస్తాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని బంధువులు ద్విచక్ర వాహనంపై సొంతూరికి తరలించే క్రమంలో విషయం పోలీసులకు తెలిసింది. వాహనాన్ని వెంబడించారు. మృతదేహాన్ని ఇల్లెందు తరలించారు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని