గ్యాంగ్‌రేప్‌కి పాల్పడి.. వీడియోని వైరల్‌ చేసి..

తాజా వార్తలు

Published : 16/09/2020 01:08 IST

గ్యాంగ్‌రేప్‌కి పాల్పడి.. వీడియోని వైరల్‌ చేసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా సీతాపుర్‌లో ఓ 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డ దుండగులు ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అప్రమత్తమైన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని మిగతావారి కోసం గాలిస్తున్నారు. సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌సింగ్‌ వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌7న సుల్తాన్‌పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను అపహరించుకుపోయిన ఐదుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో కూడా తీశారు. విషయం బయటకు చెబితే ఆ వీడియోను వైరల్‌ చేస్తామంటూ బాలికను బెదిరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా సదరు వీడియోను ఓ నిందితుడు సామాజిక మాధ్యమంలో ఉంచగా అది కాస్తా వైరల్‌ అయ్యింది. దాన్ని చూసిన పోలీసులు అప్రమత్తమై ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. క్లిప్‌ను కట్టడిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం తరలించనున్నట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని