close

తాజా వార్తలు

Published : 06/03/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!

లఖ్‌నవూ: నలుగురిని ఇష్టపడ్డ ఓ యువతి వారితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పెద్దలు వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. వివాహం చేసుకోవాలని సూచించగా.. ఆ నలుగురిలో ఎవరిని పెళ్లాడాలో తెలియక యువతి తికమకపడింది. దీంతో ఊరిపెద్దలు లక్కీ డ్రా తీసి వారిలో ఒకరితో ఆ యువతికి వివాహం జరుపుతున్నారు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 

అంబేడ్కర్‌నగర్‌లోని అజిమ్‌నగర్‌కు చెందిన యువతి ఇటీవల నలుగురు యువకులతో కలిసి ఇళ్లు వదలి వెళ్లిపోయింది. వీరంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు వారిని తిరిగి ఊరికి తీసుకొచ్చి.. నలుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలనుకున్నారు. అయితే, ఊరి పెద్దలు.. పోలీసు కేసు పెట్టొద్దని, పంచాయతీలో కూర్చొని పరిష్కరించుకుందామని యువతి కుటుంబసభ్యులతో చెప్పారు. దీంతో ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. పలుమార్లు చర్చల తర్వాత నలుగురు యువకుల్లో నచ్చిన యువకుడిని వివాహం చేసుకోవాలని యువతికి సూచించారు. కానీ, ఆ యువతి వరుడుని ఎంచుకోలేకపోయింది. ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నానో తనకు తెలియట్లేదని, ఎంపిక చేసుకోవడం కష్టంగా ఉందని వాపోయింది. దీంతో పంచాయతీ పెద్దలు చీటీలు వేసి వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. నలుగురు యువకుల పేర్లు చీటీల్లో రాసి.. చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. చిన్నారి తీసిన చీటీలో పేరున్న వ్యక్తితోనే యువతికి త్వరలో వివాహం చేయనున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని