close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో మహిళ మృతి.. ఆభరణాలు మాయం

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఘటన

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండ్రోజుల కిందట కరోనాతో ఆ ఆసుపత్రిలో బాధిత మహిళ చేరింది. చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు విడిచింది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాల చెవి కమ్మలు మాయం అయినట్లు బంధువులు ఆరోపించారు. ముక్కుపుడక కూడా మాయమైనట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని