
తాజా వార్తలు
చెన్నైలో భారీగా పట్టుబడ్డ బంగారం
చెన్నై: తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎనిమిది మంది ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు 3.15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబరు 28, 29వ తేదీల్లో దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న వీరిని తనిఖీ చేసిన అధికారులు బంగారం ఉండటాన్ని గుర్తించారు. నిందితులు ఎల్సీడీ మానిటర్, ల్యాప్‌టాప్, ట్రాలీ బ్యాగ్‌లలో బంగారాన్ని దాచారు. దీంతోపాటు ఓ ప్రయాణికుడి ప్యాంట్లో బంగారాన్ని గుర్తించారు. దీని మొత్తం విలువ రూ.1.57 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు, విచారణ చేపట్టారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు