close

తాజా వార్తలు

Updated : 12/04/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తుపాకీ మిస్‌ఫైర్‌.. హోంగార్డు భార్య మృతి

గొల్లపూడి: విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో ఓ హోంగార్డు భార్య మృతి చెందారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఏఎస్పీ శశిభూషణ్‌ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం శశిభూషణ్‌ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని ఇంటికి తెచ్చిన హోంగార్డు వినోద్‌.. ఆదివారం రాత్రి తుపాకీని భార్యకు చూపిస్తున్న సమయంలో మిస్‌ఫైర్‌ అయినట్లు సమాచారం. బుల్లెట్‌.. వినోద్‌ భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని