ఎంజేఆర్‌ విద్యా సంస్థల అధినేత ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 12/02/2021 14:45 IST

ఎంజేఆర్‌ విద్యా సంస్థల అధినేత ఆత్మహత్య

పీలేరు గ్రామీణం: పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్‌ విద్యాసంస్థల ఆధినేత మంచూరి వెంకట రమణారెడ్డి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన మంచూరి వెంకట రమణారెడ్డి(52) పీలేరు- కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. గురువారం కళాశాల ముగిసిన అనంతరం కారులో పులిచెర్ల మండలం కొడిదిపల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అక్కడ కారు దిగిన ఆయన తినడానికి ఏమైనా తీసుకురమ్మని డ్రైవర్‌ను పంపించారు. అదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్‌ రైలు వచ్చే సమయం కావడంతో రైల్వే గేటు సమీపంలో ఉండొద్దని రైల్వే సిబ్బంది వెంకట రమణారెడ్డిని వారించారు. దీంతో ఆయన ట్రాక్‌ పక్కన పీలేరు వైపు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లారు. రైలు వచ్చే సమయానికి పట్టాలపైకి రావడంతో వేగంగా వస్తున్న రైలు ఆయన్ను ఢీకొని సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఆయన శరీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పీలేరు సీఐ సాధిక్‌ అలీ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. 

ఇదీ చదవండి..
సగిలేరులో పడి ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని