మండ్యాలో హృదయ విదారక ఘటన

తాజా వార్తలు

Published : 27/05/2021 00:23 IST

మండ్యాలో హృదయ విదారక ఘటన

మండ్యా: కర్ణాటకలోని మండ్యాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. పుట్టగానే నవజాత శిశువు మరణించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. అక్కడున్నవారినీ ఆ దృశ్యం కలచివేసింది. మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యాలోని ఎంఐఎం ఆస్పత్రికి వెళ్లగా కొవిడ్‌ రిపోర్టు లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. దీంతో నొప్పులు తాళలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికి బిడ్డను కోల్పోయింది. పుట్టిన కాసేపటికే బిడ్డ చనిపోవడంతో ఆ మహిళ తీవ్రంగా రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని