కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలు
close

తాజా వార్తలు

Published : 11/05/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలు

గంగా నదిలో కలకలం

పట్నా: బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది. గంగా నదిలో కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు. కరోనా మృతులను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికుల్లో భయాందోళన సృష్టించాయి. హామిర్‌పుర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని కొందరు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని కొన్ని మృతదేహాలను అధికారులు నదిలో వదిలేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ విషయంపై హామిర్‌పుర్‌ ఏఎస్పీ అనూప్‌కుమార్‌ను ప్రశ్నించగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. హామిర్‌పుర్‌, కాన్పుర్‌ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరని.. నదిలో వదిలేస్తారని పేర్కొన్నారు. యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేవారు కూడా కొవిడ్‌ భయంతో నదిలో వదిలేస్తున్నారని.. దీంతో యమునలో కనిపించే మృతదేహాల సంఖ్య అధికంగా ఉంటోందని వెల్లడించారు. అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నా.. ఇతరుల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో దిక్కు తోచని స్థితో మరికొందరు నదిలో వదిలేస్తున్నారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని