
తాజా వార్తలు
భార్య, కుమార్తెను హతమార్చిన భర్త
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్ అనే వ్యక్తి భార్య రమ, కుమార్తె ఆమనిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. దాడి ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...
తండ్రిచేతిలో గాయపడిన బాలుడి మృతి
Tags :