AP News: ప్రాణం తీసిన వైరల్‌ వీడియో
close

తాజా వార్తలు

Published : 23/05/2021 01:42 IST

AP News: ప్రాణం తీసిన వైరల్‌ వీడియో

అమరావతి: భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియో వైరల్‌ కావడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, ఎ.సీతారాంపురానికి చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన జయబాబు అనే వ్యక్తి వీడియో తీసి దాన్ని వైరల్‌ చేశాడు. దీనిపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే బాధితురాలి భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మరణానికి కారణం జయబాబేనని బాధితురాలు ఆరోపిస్తున్నారు. భర్త హఠాన్మరణం వల్ల తన కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని, తన ఇద్దరి పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తనకు తగిన న్యాయం చేయాలంటూ పోలీసులకు మొర పెట్టుకున్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలి భర్తను చంపేస్తానని జయబాబు బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని