భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త

కావలి పట్టణం: భర్త భార్యను బ్లేడుతో కోసి హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారి పిల్లల్ని బంధువుల వద్దకు పంపి వారు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అనురాధకు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. 108, 104 వాహనాలకు సమాచారం అందించినా వాళ్లు రాలేదు. స్థానిక అధికారులకు తెలిపినా వాళ్లు స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

మద్యం సేవించిన మల్యాద్రి భార్య అనురాధపై ఇంట్లో ఉన్న బ్లేడుతో మణికట్టుపై విచక్షణారహితంగా కోశాడు. అనంతరం తాను కూడా ఎడమ చేతి మణికట్టుపై కొంత మేర కోసుకొని బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి చూడగా అప్పటికే అనురాధ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని