Accident: ప్రాణాలు పోతుంటే..ఫొటోలు తీశారు

తాజా వార్తలు

Published : 25/05/2021 01:20 IST

Accident: ప్రాణాలు పోతుంటే..ఫొటోలు తీశారు

రాయ్‌చూర్‌: ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చేందుకు బదులు చరవాణిలో దృశ్యాలను బంధించేందుకే కొందరు వ్యక్తులు శ్రద్ధ చూపడంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా బైగావత్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దార్థ్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలువిరిగి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న యువకుడ్ని ఆస్పత్రిలో చేర్చేందుకు స్థానికులెవరూ ముందుకు రాలేదు. దాదాపు గంటసేపు నెత్తురోడుతున్న గాయాలతో రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సిద్దార్థ్‌ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైనందున యువకుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. మరణ వార్తతో దిగ్భ్రాంతి చెందిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని