close

తాజా వార్తలు

Published : 17/04/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మాయితో నిశ్చితార్థం..యువకుడి కిడ్నాప్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. స్థానిక కింగ్స్‌ కాలనీలో నివాసం ఉండే నదీమ్‌ ఖాన్‌ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఇటీవలే నదీమ్‌ఖాన్‌కు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కాగా.. ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే నదీమ్‌ను అపహరించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి వేళ నదీమ్‌ ఖాన్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. అతడిని ఆపి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని