బాలిక కిడ్నాప్‌.. స్పృహలేని స్థితిలో ఆచూకీ

తాజా వార్తలు

Updated : 05/07/2021 10:21 IST

బాలిక కిడ్నాప్‌.. స్పృహలేని స్థితిలో ఆచూకీ

మేడ్చల్‌‌: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పరిధి దమ్మాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. తాపీ మేస్త్రీ శ్రీను నిన్న సాయంత్రం ఆరేళ్ల బాలికను అపహరించాడు. ఈ ఉదయం చిన్నారిని ప్రగతినగర్‌లో వదిలిపెట్టాడు. ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసి గాలింపు చర్యల్లో ఉండగా స్థానికులు ద్వారా పోలీసులకు బాలిక సమాచారం అందింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని