అమెరికాలో కోదాడ వాసి మృతి
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:33 IST

అమెరికాలో కోదాడ వాసి మృతి

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. రవికుమార్‌ గత మూడేళ్లుగా అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి  బీచ్‌లో బోటింగ్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ నీళ్లలో పడి మృతి చెందాడు. కోదాడలో ఉంటున్న రవికుమార్‌ తల్లిదండ్రులకు అమెరికాలో ఉంటున్న మిత్రులు తెలపడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కన్న కొడుకుని కడసారి చూపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే రవికుమార్‌ ఇక లేడనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని