close

తాజా వార్తలు

Updated : 28/02/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిట్టు శ్రీను..ఆయుధాలెక్కడ.?

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు ఇవాళ పార్వతీ బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. న్యాయవాదుల హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నిస్తున్నారు. ఘటన అనంతరం ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించి ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్వతీ బ్యారేజ్‌ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.  

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని