crime news: కోర్టులోనే న్యాయవాది దారుణ హత్య!

తాజా వార్తలు

Published : 19/10/2021 02:11 IST

crime news: కోర్టులోనే న్యాయవాది దారుణ హత్య!

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్‌లోనే ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. కోర్టు కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంతో అక్కడివారు కొద్దిసేపటికి మూడో అంతస్తులోకి వెళ్లి చూడగా న్యాయవాది భూపేంద్రసింగ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయన సమీపంలోనే ఓ నాటు తుపాకీ పడిఉంది. ఘటనకు కొద్దిసేపటి ముందు న్యాయవాది ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు పలువురు వెల్లడించారు. అయితే ఘటన సమయంలో మూడో అంతస్తులో న్యాయవాది ఒక్కరు మినహా మరెవరూ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ బృందం చేరుకొని పలు ఆధారాలను సేకరించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని