
తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల కలకలం
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో నాటుబాంబుల కలకలం రేగింది. కార్డన్సెర్చ్లో భాగంగా మండలంలోని గొల్ల కంచిలి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గుడిసెలో 42 నాటుబాంబులు బయటపడ్డాయి. వెంటనే బాంబులను నీళ్లలో వేసి పేలకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం వీటిని ఒడిశాలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారానికి చెందిన కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇవీ చదవండి
Tags :