close

తాజా వార్తలు

Published : 21/04/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ వ్యవహారం.. యువకుడి తండ్రి మృతి

యువతి బంధువుల దాడే కారణమని ఆరోపణలు

చింతపల్లి: ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుడి తండ్రి మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ (20), అదే గ్రామానికి చెందిన యువతి(19) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న శ్రీకాంత్, యువతి గ్రామం నుంచి వెళ్లిపోయారు. 

ఈ క్రమంలో పరువు పోయిందనే కారణంతో యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు.. శ్రీకాంత్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో అతడి తండ్రి దేవదానం ఇంట్లోనే మృతి చెందారు. యువతి బంధువులు దేవదానంపై దాడి చేయడంతోనే మరణించాడని శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన శ్రీకాంత్, యువతి జరిగిన విషయం తెలుసుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని