Crime: ప్రేమ వ్యవహారం.. ఐదుగురి దారుణ హత్య

తాజా వార్తలు

Published : 01/07/2021 01:20 IST

Crime: ప్రేమ వ్యవహారం.. ఐదుగురి దారుణ హత్య

మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు

దేవాస్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఐదుగురి అస్తిపంజరాలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దేవాస్‌ పట్టణం నేమావర్ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇద్దరు మహిళలు సహా మరో ముగ్గురు చిన్నారుల అస్తిపంజరాలను పోలీసులు వెలికితీశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. దేవాస్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ సూర్యకాంత శర్మ వివరాల ప్రకారం.. నేమావర్‌ గ్రామానికి చెందిన మోహన్‌లాల్‌ కాస్తే భార్య మమత (45), కుమార్తెలు రూపాలి (21), దివ్య (14)తోపాటు రవి ఓస్వాల్‌ కుమార్తె పూజ (15), కుమారుడు పవన్‌ (14) మే 13వ తేదీ నుంచి కనిపించకుండాపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పలు ఆధారాలను సేకరించిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సురేంద్రసింగ్‌ చౌహాన్‌, అతడి తమ్ముడు భురూ చౌహాలను విచారించారు. కాగా ఆ ఐదుగురిని తామే హత్య చేసినట్లు ఆ సోదరులు అంగీకరించారు. వారిని తమ వ్యవసాయ క్షేత్రంలోనే పాతిపెట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 అడుగుల లోతులో పూడ్చిపెట్టిన ఆ ఐదుగురి అస్తిపంజరాలను జేసీబీ వాహనం సాయంతో బయటకు తీసి ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారు.

నిందితుడు సురేంద్రసింగ్‌, మృతురాలు రూపాలి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో రూపాలితోపాటు అమె కుటుంబసభ్యులు సురేంద్రను నిలదీశారు. ఈ విషయంపై మాట్లాడుకుందామని, తమ పొలం వద్దకు రావాలని రూపాలికి చెప్పాడు. దీంతో తల్లి మమతతోపాటు సోదరి దివ్యతోపాటు మరో ఇద్దరు పూజ, పవన్‌తో కలిసి రూపాలి అక్కడకు వెళ్లింది. అక్కడ వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన సురేంద్ర ఆ ఐదుగురిని హత్య చేశాడు. ఇందుకు సోదరుడు భూరూసింగ్‌తోపాటు మరో నలుగురు సహకరించారు. అనంతరం అక్కడే గొయ్యి తీసి వారిని పాతిపెట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు సురేంద్ర.. రూపాలి సెల్‌ఫోన్‌ను ఓ వ్యక్తికి ఇచ్చి పలు ప్రాంతాల్లో సంచరించాలని సూచించాడు. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు ఆ ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని