ప్రేయసి కాదందని.. ఆత్మహత్యాయత్నం 

తాజా వార్తలు

Updated : 24/03/2021 13:04 IST

ప్రేయసి కాదందని.. ఆత్మహత్యాయత్నం 

గుంటూరు: ప్రేమించిన యువతితో విభేదాల కారణంగా ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నరసరావుపేట మండలం గురవాయిపాలేనికి చెందిన మహేశ్‌  బీటెక్‌ పూర్తి చేసి దిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆపరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ.. సెలవులపై వచ్చిన మహేశ్‌  గుంటూరులో ఆత్మహత్యకు యత్నించాడు. 

గోరంట్లలోని ఐడీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకుని...కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగాడు. అనంతరం బ్లేడ్‌తో చేయి కోసుకుని రక్తం పోవడాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపాడు. గదిలో  నుంచి శబ్దాలు రావడంతో గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగులగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న నల్లపాడు పోలీసులు 108లో యువకుడిని జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులు వచ్చి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని