మదనపల్లె హత్యలు.. నిందితులకు బెయిల్‌

తాజా వార్తలు

Published : 28/04/2021 01:15 IST

మదనపల్లె హత్యలు.. నిందితులకు బెయిల్‌

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో మదనపల్లెలోని తమ ఇంట్లో కన్న కుమార్తెలు ఇరువురినీ దారుణంగా హతమార్చిన కేసులో అరెస్టు అయిన పద్మజ, పురుషోత్తంలకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పద్మజ, పురుషోత్తంలకు తొలుత తిరుపతి రుయా ఆస్పత్రిలో.. అనంతరం విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు షరతులతో కుడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని