Fire Accident: దిల్లీలో భారీ అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Published : 21/06/2021 10:58 IST

Fire Accident: దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ దిల్లీ ప్రాంతంలోని ఉద్యోగ్‌ నగర్‌లో ఉన్న ఓ బూట్ల తయారీ కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. దాదాపు 24 అగ్నిమాపక యంత్రాలు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. అయితే, భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని