close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అద్దె అడిగినందుకు కత్తితో దాడి

హైదరాబాద్‌: ఇంటి అద్దె అడిగిన యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై అనంతచారీ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడలోని వి.ఎన్.రెడ్డి కాలనీలో 382/56 ఇంట్లో ఆటో డ్రైవర్‌ దాల నిచ్చెల్ అలియాస్ కార్తీక్ (24) గత కొంతకాలంగా భార్యతో కలసి అద్దెకు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత ఎనిమిది నెలల నుంచి ఇంటి అద్దె ఇవ్వలేదు. 

ఈ నెల 11న రాత్రి అద్దె కోసం ఇంటి యజమాని వజ్రమ్మ తనయుడు సాయిలు గౌడ్ కార్తీక్‌ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి సాయిలు గౌడ్‌పై కార్తీక్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సాయిలు రెండు చేతుల వెళ్లు తెగిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కార్తీక్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసి మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై అనంతచారీ తెలిపారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని