Ap News: ఇసుక రీచ్‌ల పేరుతో మోసం

తాజా వార్తలు

Updated : 10/06/2021 15:35 IST

Ap News: ఇసుక రీచ్‌ల పేరుతో మోసం

విజయవాడ: ఇసుక రీచ్‌ల సబ్‌ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ. కోట్లు వసూలు చేశాడు ఓ ఘరానా మోసగాడు. కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ తనకు జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మించి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ దస్త్రాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు వసూలు చేసి సబ్ లీజ్ ఇవ్వకపోవటంతో బాధితులు జేపీ గ్రూప్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జేపీ గ్రూప్‌ సంస్థ మేనేజర్ హర్షకుమార్ ఈ విషయంపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇసుక రీచ్‌ల పేరుతో ఇప్పటివరకు ఏడుగురి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని