క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి కత్తి గుచ్చుకుని..
close

తాజా వార్తలు

Published : 02/04/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి కత్తి గుచ్చుకుని..

చింతలపూడి(గ్రామీణం) : పశ్చిమ గోదావరి జిల్లాలో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తు కత్తి గుచ్చుకోవడంతో మృతి చెందాడు. ఈ  ఘటన చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(56) గత 13రోజులుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భార్యతో కలిసి హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఇతను ఇంట్లో కూరగాయలు కోస్తున్నాడు. వంటింట్లోకి వెళ్లి వచ్చిన క్రమంలో అతడు కాలుజారి కింద పడిపోవడంతో కత్తి గుండె పైభాగంలో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ఉన్న పోలీసులు, ఏఎన్‌ఎంలు ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో 108కు సమాచారం అందజేశారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమయానికి వైద్యం అందక అతడు మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ, అతడి కుమారుడు.. ఇటీవల గ్రామంలో జరిగిన ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఈ కార్యక్రమానికి హాజరైన 90మంది గ్రామస్థులను హోంక్వారంటైన్‌లో ఉంచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని