close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం సవాలులో ఓడిన ప్రాణం

మామడ (నిర్మల్‌): ఐదుగురు మిత్రులు కలసి సరదాగా ఏర్పాటు చేసుకున్న విందులో ఒకరి ప్రాణం పోయిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఈ ఘటన కొంతమంది మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో 20 నిమిషాల్లో మద్యం పుల్ బాటిల్ తాగాలని మిత్రులు వేసిన పందానికి ఖాజా రసూల్(31) అనే వ్యక్తి బలయ్యాడు. వేగంగా మద్యం తాగే క్రమంలో రసూల్‌ కుప్పకూలిపోయాడు. అతిగా మద్యం తాగేలా రెచ్చగొట్టి రసూల్ మరణానికి కారకులైన రత్తయ్య, నాగూర్ బాషాపై కేసు నమోదు చేసినట్లు సీఐ జీవన్ రెడ్డి తెలిపారు. మృతుని స్వగ్రామం ప్రకాశం జిల్లా కాగా... తెలంగాణలోని లక్ష్మణ్‌చందా మండలం చింతలచందాలో తాపీ మేస్త్రీగా స్థిరపడ్డాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. 

 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని