స్నేహితుడి మరణం.. ముగ్గురు మిత్రుల ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 04:59 IST

స్నేహితుడి మరణం.. ముగ్గురు మిత్రుల ఆత్మహత్య

తెహ్రీ: ఆ ఏడుగురు స్నేహితులు. చేతిలో తుపాకీ పట్టుకుని అర్ధరాత్రి అడవిలోకి వేటకు బయలుదేరారు. అయితే ప్రమాదవశాత్తు ఓ మిత్రుడికి బుల్లెట్‌ తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దాంతో తీవ్రమైన బాధకు, పశ్చాత్తాపానికి గురైన మరో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుండీ గ్రామానికి చెందిన ఏడుగురు శనివారం రాత్రి సమీపంలోని అడవికి వేటకు వెళ్లారు. తుపాకీ పట్టుకొని రాజీవ్‌ (22) ఈ బృందాన్ని ముందుండి నడిపిస్తూ, ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అప్పుడు అతడి చేతిలోని తుపాకీ పేలింది. బుల్లెట్‌ నేరుగా వచ్చి సంతోష్‌కు తాకింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

మిత్రుడి మరణంతో మిగతా ఆరుగురు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రాజీవ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత శోభన్‌, పంకజ్‌, అర్జున్‌ విషగుళికలు తిన్నారు. మిగతా ఇద్దరు రాహుల్‌, సుమిత్‌ పరుగుపరుగునా వెళ్లి అసలు విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. వారు హుటాహుటిన వచ్చి చూడగా పంకజ్‌, అర్జున్‌ అప్పటికే మృతిచెందారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న శోభన్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా 18-22 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని