పోలీసుల అదుపులో మల్లిక్‌

తాజా వార్తలు

Updated : 06/07/2021 05:14 IST

పోలీసుల అదుపులో మల్లిక్‌

హైదరాబాద్‌: కొవిడ్ మూడో దశ వ్యాప్తిపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్‌ను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతనెల 8న ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్న మల్లిక్.. వైద్య విలువలు పాటించకుండా మాట్లాడారంటూ.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ గత నెల 14న సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసు బృందం విశాఖపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లి మూడు రోజుల క్రితం నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు విచారించిన అనంతరం స్టేషన్‌ బెయిల్‌ మంజూరు కావడంతో మల్లిక్‌ను విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని