Madhya Pradesh: మూఢ నమ్మకాల పైత్యం.. వర్షం కోసం బాలికలతో నగ్నంగా..!

తాజా వార్తలు

Updated : 06/09/2021 22:29 IST

Madhya Pradesh: మూఢ నమ్మకాల పైత్యం.. వర్షం కోసం బాలికలతో నగ్నంగా..!

భోపాల్: పండుగలు, ప్రచారాలు, గుప్త నిధులు, సంతానం కోసం.. ఇలా ఆయా సందర్భాల్లో పలువురు మూఢ నమ్మకాలు, వింత ఆచారాలు పాటించడం తెలిసిందే. ఇలాంటిదే మధ్యప్రదేశ్‌ దామోహ్‌ జిల్లాలోని ఓ గ్రామస్థుల మూఢ నమ్మకం వివాదాస్పదమైంది. వర్షాల కోసం వారు ఆదివాసీ బాలికలను నగ్నంగా ఇంటింటికి నడిపించారు. వారితో బరువైన రోలు మోయిస్తూ, భజనలు చేయిస్తూ, భిక్షమెత్తించారు. ఇలా సమకూరిన ఆహార పదార్థాలను గ్రామ దేవాలయం ముందు అన్నదానానికి సమర్పించి.. అక్కడ పూజలు చేస్తే వర్షం కురుస్తుందని వారి నమ్మకం.

ఈ వ్యవహారం స్థానిక పత్రికల్లో వెలుగుచూడటంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం దామోహ్ కలెక్టర్‌కు లేఖ రాసింది. సమగ్ర విచారణ జరిపి, పది రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అంతకుముందు దామోహ్ ఎస్పీ తెనివర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కారణంగా, గ్రామస్థులు పిల్లల అనుమతితోనే ఏటా ఈ పద్ధతిని అనుసరిస్తారని చెప్పారు. ‘ఎవరైనా వారితో బలవంతంగా ఇలా చేయించారా అనేది కనుక్కొనేందుకు దర్యాప్తు చేస్తున్నాం. ఇదే నిజమని తేలితే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని