AP News: తాడిప‌త్రిలో త‌ల్లీకుమార్తె ఆత్మ‌హ‌త్య‌
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 13:45 IST

AP News: తాడిప‌త్రిలో త‌ల్లీకుమార్తె ఆత్మ‌హ‌త్య‌

 

తాడిప‌త్రి గ్రామీణం: మ‌న‌స్తాపానికి గురైన‌ త‌ల్లీకుమార్తె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విషాద ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర‌కు.. పుట్లూరు మండలం చింతరపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి భార్య వెంకటరమణమ్మ(52), కుమార్తె అపర్ణ(25)తో కలిసి తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం రోడ్డులో నివాసం ఉండేవారు. గ‌తేడాది క‌రోనా బారిన ప‌డి రామ‌కృష్ణారెడ్డి మృతిచెందారు. అత‌డి భార్య, కుమార్తె ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కుమార్తె అప‌ర్ణ పుట్లూరు మండ‌లం గూడూరు స‌చివాలయంలో స‌ర్వేయ‌ర్‌గా విధులు నిర్వ‌హించేవారు.

తండ్రి మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి అప‌ర్ణ‌తో పాటు ఆమె త‌ల్లి త‌ర‌చూ ఇంటి పెద్ద లేడ‌ని బాధ‌ప‌డుతుండేవారు. ఆదివారం రాత్రి తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వారు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను శ‌వ‌ప‌రీక్ష నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని