close

తాజా వార్తలు

Updated : 16/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాగదోషమని పసికందు గొంతు కోసిన తల్లి

మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో దారుణం చోటుచేసుకుంది. నాగదోషం ఉందని ఓ తల్లి ఆరునెలల పసికందును కత్తితో గొంతు కోసి హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బానోత్‌ భారతికి అదే తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరునెలల ఈషా అనే చిన్నారి ఉంది. కొన్నినెలల కిందట గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి.. భారతికి నాగదోషం ఉందని చెప్పడంతో ఆమె పూజలు చేయడం ప్రారంభించింది.

అలా నిత్యం పూజలు చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి ఈషాను చూసి నాగుపాముగా భావించింది. అంతలోనే దేవుడి చిత్రపటాల ముందు చిన్నారిని ఉంచి పూజలు చేసి కత్తితో గొంతు కోసి బలితీసుకుంది. అనంతరం బయటికి వచ్చి తన బిడ్డను హతమార్చినట్లు స్థానికులకు తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని